• Contact us
  • Privacy Policy
  • About Us

The Bible answer for the all misconceptions in Christianity | www.answerofbible.com

  • Home
  • English Articles
  • తెలుగు అంశములు
  • Books
  • Videos
  • Editorial
  • More
    • General Topics (English)
    • General Topics (Telugu)
    • Folders (English)
    • Folders (Telugu)
    • Bible-Quran topics

Recent Acticles

Home » Articles » యేసు దేవుడా? మెస్సీయా? » యోహాను 1:1-14 వాక్యాలు “యెహోవాయే యేసుగా అవతరించాడ”ని చెబుతున్నాయా?

యోహాను 1:1-14 వాక్యాలు “యెహోవాయే యేసుగా అవతరించాడ”ని చెబుతున్నాయా?

Posted by The Bible answer for the all misconceptions in Christianity | www.answerofbible.com on Friday, 12 May 2017
Label: Articles, Label: యేసు దేవుడా? మెస్సీయా?

ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన (వాక్యము) ఆడియందు దేవుని (యెహోవా) యొద్ద ఉండెను. –యోహాను 1:1-2

యోహాను సువార్త పై ప్రారంభ వాక్యాలను బట్టి నేటి సువార్తీకుల వాదన ఏమిటంటే- “వాక్యము దేవుడై ఉండెను” అంటే “వాక్యమే యెహోవా!” ఆ వాక్యమే “శరీరధారిగా మారి కృపాసత్యసంపూర్ణునిగా మన మధ్య నివసించెను” (యోహాను 1:14) కాబట్టి యెహోవాయే యేసుగా అవతరించాడు!” అన్నది. అదే త్రిత్వ వాదుల  ప్రకారం యెహోవాతో పాటు ఉన్న వాక్యమే యేసు. కాబట్టి యెహోవాతో పాటు యేసు కూడా దేవుడై ఉన్నారన్నది! ఈ ప్రచారాలు  ఎంతవరకు సమంజసం అన్నది గమనిద్దాం.

యెహోవా పలికే వాక్యం కూడా యెహోవాతో పాటు సమాన దేవుడు అవుతుందా?


ఎంతమాత్రం అవ్వదు! కారణం స్వయంగా యెహోవా ఈ క్రింది విధంగా ప్రకటించటమే!


నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు. నా తరువాత ఏ దేవుడూ నుండడు. –యెషయా 43:10

పై వాక్యాన్ని బట్టి యెహోవాకు ముందు గానీ, యోహోవా తరువాత గానీ ఏ దేవుడూ నిర్మించబడలేదు, మరెవరూ ఆయనతో పాటు దేవునిగా ఉండలేదు ఉండబోడు అని తేటతెల్లమయింది. వాస్తవం ఇదైనప్పుడు యెహోవా పలికే వాక్యంకూడా యెహోవాలో ఒక భాగమే కాబట్టి యెహోవా పలికే వాక్యం కూడా యెహోవాతో పాటు సమాన దేవుడు! అని నేటి సువార్తీకులు చేస్తున్న ప్రచారం ఎంతవరకు సమంజసమో కాస్త ఆలోచించండి.

యెహోవా పలికే వాక్యం కూడా యెహోవాను పోలిన దేవుడు అవుతుందా?

 చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు. –యెషయ 46:9

యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమియందైనను నీవంటి దేవుడొకడునులేడు.-1 రాజుల 8:23   

పై వాక్యాలను బట్టి యెహోవాను పోలినదేదీ ఈ సృష్టిలో లేదని అర్ధమవుతుంది. దీనిని బట్టి యెహోవా వద్ద ఉన్న వాక్యం లేక యెహోవా నుండి వెలువడే వాక్యం యెహోవాను పోలిన దేవుడు ఎంతమాత్రం కాదని తేటతెల్లమైంది.

యెహోవాతో పాటు దేవుడని పిలువబడిన వాక్యం యేసా!?

ముందు వివరణలో యెహోవా వద్ద ఉన్న వాక్యం యెహోవాతో పాటు ఒక సమాన దేవుడు ఎంతమాత్రం కాదని తెలుసుకున్నాం. అయితే త్రిత్వ వాదుల ప్రకారం వాక్యం ఎవరోకాదు అది యేసే అన్నది. కారణం “దేవుని వాక్యం అను నామము ఆయనకు పెట్టబడియున్నది” (ప్రకటన 19:13) కాబట్టి. యేసే దేవుని వాక్యం అన్నది.

దేవుని వాక్యం వేరు! యేసు వేరు!

అతడు దేవుని వాక్యమును గూర్చియు, యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మటుకు సాక్ష్యమిచ్చెను. – ప్రకటన 1:2

...యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. – ప్రకటన 20:4

ఒకవేళ దేవుని వాక్యమే యేసు అయితే పై వాక్యాలలో దేవుని వాక్యానికి వేరుగా యేసు పరిచయం ఉండటం అసంభవం అవుతుంది. కానీ “దేవుని వాక్యము నిమిత్తము” “యేసు నిమిత్తము” వేరు వేరుగా సాక్ష్యాలు ఇవ్వటాన్ని బట్టి యేసు వేరు! దేవుని వాక్యం వేరని తేటతెల్లమవుతుంది. మరీ ముఖ్యంగా “దేవుని వాక్యం అను నామము ఆయనకు పెట్టబడియున్నది” (ప్రకటన 19:13) అన్న వాక్యభాగాన్ని బట్టి యేసు, దేవుని వాక్యం కాబట్టి యేసుకు దేవుని వాక్యం అని పేరు పెట్టబడలేదు! ఆయనే దేవుని వాక్యం అయితే తిరిగి దేవుని వాక్యం అని పేరు పెట్టటం దేనికి? కేవలం ఆయనకు దేవుని వాక్యం అని పేరు పెట్టబడింది అంతే! అయితే వాక్యం అనే పేరు యేసుకు ఎందుకు పెట్టబడిందో తెలుసుకునే ముందు ఈ క్రింది వాక్యాన్ని గమనించగలరు.

యేసు- నీవు (యెహోవా) అనుగ్రహించిన వాక్యములు వారికి (శిష్యులకు) ఇచ్చియున్నాను. –యోహాను 17: 6,7

I have given to them the words which you have given me.- John 17:6,7

యేసు, దేవునితో – “నీవు (యెహోవా) అనుగ్రహించిన వాక్యములు వారికి (శిష్యులకు) ఇచ్చియున్నాను” అంటున్నారు. ఒకవేళ దేవుని వాక్యమే ప్రత్యక్షంగా యేసు అయితే తిరిగి యేసు “దేవుని వాక్యములు” శిష్యులకు ఇవ్వటం ఏమిటి? అయితే నేటి సువార్తీకుల వాదన ఏమిటంటే సకల సృష్టి దేవుని వాక్యం వల్లనే ఉనికిలోనికి వచ్చింది, కానీ ఒక్క యేసు మాత్రమే వాక్యం వలన కాక వాక్యమే ఆయన రూపంలో పుట్టటం జరిగిందన్నది.  ఇలాంటి వాదనలు చేసేవారు ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.

యేసు- వారికి నీ వాక్యము ఇచ్చియున్నాను. –యోహాను 17:4

...సత్యమందు వారిని ప్రతిష్టచేయుము. నీ వాక్యమే సత్యము. –యోహాను 17:17  

ప్రత్యక్షంగా దేవునిలో నుండి వెలువడిన వాక్యమే యేసు అయితే… పై వాక్యాలలో యేసు (తనకు అతీతంగా ఉన్న) వాక్యం యొక్క ప్రస్తావనే చేయకూడదు కదా? ఈ ప్రశ్నకు నేటి సువార్తీకులు  అబ్బే యేసు దేవుని వాక్యం యెక్క సంపూర్ణ రూపమై ఉన్నారు! దేవుని వాక్యం వేరు, యేసు పొందిన దేవుని వాక్యాలు వేరు! అంటూ ఏవేవో పొంతనలేని కుంటి సాకులు చెబుతుంటారు!

ఒకవేళ దేవుని వాక్యం కూడా యెహోవా వంటి దేవుడే అనుకుంటే బైబిల్లో యెహోవా అనేకమంది ప్రవక్తలకు, యేసుకు ఇచ్చిన కోటాను కోట్ల వాక్యాలను కోటాను కోట్ల యెహోవాలని ఒప్పుకోవాలి! ఒకవేళ దేవుని వాక్యం ప్రత్యక్షంగా యేసు అనుకుంటే అప్పుడు బైబిల్లో యెహోవా అనేకమంది ప్రవక్తలకు, యేసుకు ఇచ్చిన కోటాను కోట్ల వాక్యాలను కోటాను కోట్ల యేసులని ఒప్పుకోవాల్సి ఉంటుంది!!!  

యెహోవాను తప్ప మరొకరిని దేవునిగా అంగీకరించే అవకాశం బైబిల్ కల్పిస్తుందా?

నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. –నిర్గమ 20:3

ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు. –యెషయ 45:18

అయితే యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి యొకడు లేడనియు నీవు తెలిసికొనునట్లు అది నీకు చూపబడెను. –ద్వితీ 4:35

యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియు లేదు. -1 సమూ 2:2

కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనతగలవాడవు, నీవంటి దేవుడొకడును లేడు; మేము వినిన దానినంత టిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు. -2 సమూ 7:22

యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? – 2 సమూ 22:32

యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవుతప్ప మరి ఏ దేవుడును లేడు. – 1 దిన 17:20

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు. -యెషయా 44:6

నేను తప్ప వేరొక దేవు డున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే నెరుగను.  –యెషయా 44:8

నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పుదిక్కునుండి పడమటి దిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొను నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. –యెషయా 45:5,6

...యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు.నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. –యెషయా 45:21

ఆ శాస్త్రిబోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన (యెహోవా) అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. –మార్క్ 12:32

ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడు న్నాడు. ఆయన తండ్రి... 1 కోరింధీ 8:4-6             

పై వాక్యాలను బట్టి ఒక్క యెహోవాను తప్ప దేవుని వాక్యాన్నో లేక యేసునో లేక మరొకరినో యెహోవాతో పాటు సమాన దేవునిగా అంగీకరించే అవకాశం లేనేలేదని తేటతెల్లమవుతుంది.

బైబిల్లో ఒక్క వాక్యం మాత్రమే దేవుడని పిలువబడిందా?

పూర్తి బైబిల్లో ఒక్క యెహోవా లేక వాక్యం మాత్రమే దేవుడని పిలువబడలేదు! కానీ అనేకమంది దేవుళ్ళని పిలువబడ్డారు.

నిర్గమ 4:16 + 7:1 వాక్యాల ప్రకారం మోషే దేవుడని పిలువబడ్డాడు.

కీర్తనలు 82:1-6 వాక్యాల ప్రకారం అనేక విశ్వాసులు దేవుళ్లని పిలుబడ్డారు.

యోహాను 10: 34-35 వాక్యాల ప్రకారం దేవుని వాక్యం పొందిన ప్రతీ ఒక్కరూ దేవుళ్లని తెలుస్తుంది.

2 కోరింతీ 4:4 లో సాతాను సైతం దేవుడని పిలువబడ్డాడు.    

అయితే దేవుని వాక్యం దేవుడని ఎందుకు పిలువబడింది?

ఇక పూర్తి బైబిల్లో ఒక్క యెహోవా లేక వాక్యం మాత్రమే దేవుడని పిలువబడలేదు! కానీ అనేకమంది దేవుళ్ళని పిలువబడ్డారన్నది మనం తెలుసుకుని ఉన్నాం. అయితే అనేక మండి దేవుళ్లని ఎందుకు పిలువబడ్డారు? అంటే కేవలం దేవుని తరఫునుండి వారికి ఇవ్వబడిన అధికారాన్ని బట్టి వారు “అధికారులు” అన్నదానికి అలంకారికంగా దేవుళ్ళు అని పిలువబడ్డారు. ఇక సాతాను చెడు చేసేవారిపై అధికారం ఇవ్వబడింది కాబట్టి వాడు సైతం దేవుడని పిలువబడ్డాడు.

అలాగే దేవుడు తాను తలిచింది సృష్టించాలనుకున్నాప్పుడు “అగుము” అన్న తన వాక్యం విడుదల చేసేవాడు. ఆ వాక్యం ఆధారంగానే సకల సృష్టి ఉనికిలోనికి రావటం జరిగింది. ఉదా:- “దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను” (ఆది 1:3), దేవుడు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అని పలుకగా ఆ ప్రకారమయెను” (ఆది 1:14).

ఈ విధంగా దేవుడు  తన వాక్యం ద్వారా సమస్తమూ సృష్టించబడటానికి వాక్యానికి సైతం అధికారం ఇచ్చాడు. కాబట్టి వాక్యం కూడా దేవుడని పిలువబడింది.

“వాక్యం దేవుడై ఉండెను” అన్న అనువాదం విషయంలో క్రైస్తవ పండితుల మధ్య బేధాభిప్రాయం ఉంది!

“2 వ శతాబ్దపు క్రైస్తవ పండితుల మధ్య “వాక్యము దేవుడై ఉండెను” అన్న అనువాదం పై తీవ్ర భేదాభిప్రాయం ఉన్నాట్టు తెలుసుకోగలం. వాస్తవానికి అరమాయిక్  ఉల్లేఖనాల నుండి గ్రీకులో క్రొత్త నిబంధన వ్రాసినప్పుడు “థియో” (దేవుని యొక్క) అని వ్రాయటానికి బదులు “థియోస్” (దేవుడు) అని వ్రాయటం వలన “వాక్యము దేవుడై ఉండెను” అని వ్రాయబడింది. వాస్తవానికి “వాక్యము దేవునిదై యుండెను” అని వ్రాయబడాల్సి ఉంది.
Ref: Prof: David Benjamin Keldani, a Roman Catholic Bishop of Uraemia, Mohammad in Bible Page – 25

బైబిల్లో అనేక మంది దేవుళ్లు ఉన్నప్పటికీ వారందరికీ పైగా ఉన్న దేవ దేవుడు ఎవరు?

ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును, పరమ ప్రభువునై యున్నాడు. – ద్వితీ 10:17 

శరీరధారిగా అవతరించిన వాక్యం యెహోవానా?
1 ప్రశ్న:   ఆదియందు ఉన్న వాక్యం ఎవరు?
జవాబు:  వాక్యము దేవుడై యుండెను. [మోషే, న్యాయాధిపతులు, ప్రవక్తలు, అనేకమంది                                                                    విశ్వాసులు దైవాలని పిలువబడినట్టు]
2 ప్రశ్న:    ఆ వాక్యము ఆదిలో ఎక్కడ ఉండెను?
జవాబు:   ఆయన (దేవుడని పిలువబడిన వాక్యము) ఆదియందు దేవుని (యెహోవా అనే                            మహాదేవుని) యొద్ద ఉండెను.

దీనిని బట్టి ఆదిలో దేవుడని పిలువబడిన వాక్యము యెహోవా అనబడే మహా దేవుని “వద్ద” ఉండెను అని తెలుస్తుంది. దీనిని బట్టి దేవుని వాక్యం ప్రత్యక్షంగా యెహోవా కాదని తెలుస్తుంది.       

శరీరధారిగా అవతరించింది యెహోవానా? వాక్యమా?

 “వాక్యం” అంటే దేవుడు తన సంకల్పాని తెలియజేసే మాట లేక “ఆజ్ఞ” “AN ORDER” అని అర్ధం. తప్పితే దానికి వేరేగా ఒక ఉనికి అంటూ ఉండదు. ఉదాహరణకు క్రింది వాక్యం గమనించగలరు.

యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వ సమూహము కలిగెను. –కీర్తనలు 33:6

పై లేఖనంలో “వాక్యం” అంటే “నోటి ఊపిరి” అని చెప్పబడింది. దేవుడు తన వాక్యం విడుదల చేశాకే సకల సృష్టి ఉనికిలోనికి వచ్చింది. “ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి” – హెబ్రీ 11:3. అదేవిధంగా దేవుడు కన్యమేరీ గర్భం ద్వారా యేసుని పుట్టించాలని సంకల్పించి తన ఆజ్ఞను విడుదలచేశాడు. వివరంగా చెప్పాలంటే ఏ విధంగా అయితే యెహోవా తన “అగుము” అన్న వాక్యంతో సమస్త సృష్టినీ ఉనికిలోనికి తీసుకుని వచ్చాడో, అలాగే తండ్రి లేకుండా కన్యమేరీ గర్భం ద్వారా యేసును పుట్టించాలని సంకల్పించుకుని ఒక ఆజ్ఞను విడుదల చేశాడు. ఆ ఆజ్ఞ (వాక్యం) నవ మాసాల అనంతరం జరిగిందేమిటంటే...

ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మనమధ్య నివసించెను.  –యోహాను 1:14

యెహోవా వాక్యం ద్వారా యేసు పుట్టారు! దానికి గొప్ప సాక్ష్యం ఈ క్రింది వాక్యమే!

...తండ్రి (యెహోవా) వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. –యోహాను 1:14

ఇదే విషయాన్ని పౌలు ఎంతో స్పష్టంగా ఈ క్రింది విధంగా చెబుతున్నాడు.

అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇస్రాయేలూ కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. –అ.పో.కా 13:23   

ఈ విధంగా “తండ్రి వలన” అంటే “తండ్రి ఆజ్ఞ వలన” లేక “తండ్రి వాక్యం వలన” యేసు పుట్టారు. తప్పితే ప్రత్యక్షంగా యెహోవాయే యేసుగా పుట్టలేదు! అందుకే యేసుకు అలంకారికంగా "దేవుని వాక్యము అను నామము" పెట్టబడింది. అంతేకాదు ముందు అంశాలలో దేవుని వాక్యమే ప్రత్యక్షంగా యేసు కాదని తెలుసుకున్నాం. దేవుని వాక్యం వలన ఒక్క యేసే కాదు అందరూ దేవుని వాక్యం ఆధారంగా పుట్టించబడిన వారే! దానికి  ఆధారంగా క్రింది వాక్యాలు గమనించగలరు.

మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు. - 1 పేతురు 1:22

ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి- హెబ్రీ 11:3

ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రధమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను..- యాకోబు 1:18

ఆ వాక్యము శరీరధారియై కృపా సత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను. -యోహాను 1:14     

యెహోవాయే యేసుగా అవతరించాడన్న వాదనను ఖండిస్తున్న యోహాను సువార్త!

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. –యోహాను 3:16

జీవముగల తండ్రి నన్ను పంపెను... –యోహాను 6:57

నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను. – యోహాను 16:28

నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చి యున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. –యోహాను 8:42

తండ్రి నన్ను పంపినప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. –యోహాను 20:21       

పై పరిశుద్ధ వాక్యాలను బట్టి యెహోవా యేసుగా అవతరించలేదు గానీ యెహోవా, యేసును ఈ లోకంలో పంపాడని తేటతెల్లమవుతుంది. ఒకవేళ నిజంగా యోహాను సువార్త ప్రారంభ వాక్యాలను బట్టి “దేవుని వాక్యం” కూడా యెహోవా అయితే, ఆ యెహోవాయే యేసుగా అవతరించి ఉంటే... అదే యోహాను సువార్తలో వ్రాయబడిన పై వాక్యాలన్నీ అబద్ధం అయిపోతాయి. ఇప్పటి వరకు గమనించిన వివరణను బట్టి ఆది యందు ఉన్న వాక్యం నేటి సువార్తీకులు ఊహించుకున్నట్టు ప్రత్యక్షంగా యెహోవా కాదు! అలాగే త్రిత్వ వాదులు ఊహించుకున్నట్టు వాక్యం అంటే ప్రత్యక్షంగా యేసు కూడా కాదు! అలాగే దేవుడు ఏ విధంగా అయితే సమస్త సృష్టిని తన “ఆజ్ఞ” (వాక్యం) ద్వారా ఉనికిలోనికి తీసుకుని వచ్చాడో  అచ్చం అలాగే కన్యామేరీ గర్భం ద్వారా తండ్రి లేకుండా యేసును పుట్టించాలని సంకల్పించి తన ఆజ్ఞ లేక వాక్యం ద్వారా యేసును పుట్టించాడు.      

0 Response to "యోహాను 1:1-14 వాక్యాలు “యెహోవాయే యేసుగా అవతరించాడ”ని చెబుతున్నాయా?"

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • “Yahweh” in Hebrew is... “Allah” in Aramaic & Arabic!
    The Hebrew term Jehovah which appears in Old Testament has been translated as Allah in Aramaic and Arabic New Testaments. To know this f...
  • What is real meaning of “I and Father are one?”
    I and my Father are one. – John 10:30 Believe me that I am in the Father and the Father in me… -John 14:11 According to the above ...
  • రోమా 9:5 ప్రకారం యేసు దేవుడా? | Is Jesus God according to Romans 9:5?
    Is Jesus God according to Romans 9:5? రోమా 9:5 ప్రకారం యేసు దేవుడా? “ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరమూ స్తోత్త్రార్హుడైయున్నాడ...
  • “గుర్తింపుపేరు”కు “గుణనామానికి” మధ్య భేదం ఏమిటి? | What is the difference between identity name? And attributive name?
    What is the difference between identity name And attributive name? “గుర్తింపుపేరు”కు “గుణనామానికి” మధ్య భేదం ఏమిటి? సాధారణంగా మని...
  • According to Isaiah 9:6… Is Jesus Mighty God?
    For unto us a Child is born, unto us a Son is given; And the government will be upon His shoulder. And His name will be called Wonderful, ...
  • జెకర్య 2:10 & మలాకీ 4:5,6 వాక్యాల ప్రకారం యెహోవాయే యేసుగా వచ్చారా?
    సీయోను నివాసులారా , నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును . – జెకర్య 2:10 యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగ...
  • IS MAN A BORN SINNER?
    IS MAN A BORN SINNER? In the name of Creator most merciful and beneficent What the theory of original sin which is being propagate...
  • IS JESUS GOD? WHY DID NOT PAUL PREACH SO?
    In the name of Creator most Merciful and Beneficent My dear Christian brethren! Though there are many of the Christian missionarie...
  • యేసు దేవుడే అయితే యేసు స్వతంత్రంగా కలిగి ఉన్న ప్రత్యేకత ఏదైనా ఉందా?
    నేటి అభినవ సువార్తీకుల వాదన ఏమిటంటే- యేసు తండ్రి లేకుండా పుట్టారు , అనేక అద్భుతాలు చేయగలిగారు , పాపులను క్షమించారు , ఇంకా ఆయనకు  సర్వాధ...
  • One who depends upon the Father (God) can be regarded to be equal with Him in any way?
    ONE WHO PROCLAIMS “I CAN DO NOTHING OF MYSELF” CAN BE  REGARDED  AS GOD HIMSELF? OR EQUAL WITH GOD? Then Jesus answered and said to...

Recent Posts

answer of bible

Recent Comments

Total Pageviews

Labels

Articles Books Books-1 Editorial General Topics (English) Is God Trinity? Or One? Is Jesus God? Or Messiah? Is The Blood necessary for Salvation? Jehovah is Allah OUR PURE AIM Slider Videos Was Jesus Died on Cross? Who is Another comforter? యేసు దేవుడా? మెస్సీయా?

Pages

  • Home
  • English Articles
  • Telugu Articles
  • Books Download
  • Editorial
  • Contact
  • About us
Copyright © The Bible answer for the all misconceptions in Christianity | www.answerofbible.com | Designed by Sakshyam Creative