Posted by The Bible answer for the all misconceptions in Christianity | www.answerofbible.com on Wednesday, 14 June 2017

“ఆది మానవులైన ఆదాము హవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమణ పాపంగా మారి, అది సకల మానవాళికి జన్మతః సంక్రమించింది. దాని కారణంగా మానవులందరూ పాపస్వభావులైపోయి, పుట్టుకతోనే పాపులుగా పుడుతు న్నారు. దానికి పరిష్కారంగా పాతనిబంధనలో దేవుడు ఎంతో రక్తం చిందింప జేసినప్పటికీ మానవుల ప్రవర్తనలో మార్పు రాలేదు.
ఈ పథకంలో విఫలమైన దేవుడు తానే యేసులా ఈ లోకంలో దిగిపోయి (కొందరి ప్రకారం యేసును పంపి) సిలువపై రక్తం చిందించి, పాపులకోసం “పెనాల్టీ” చెల్లించేశాడు. కాబట్టి రక్షణకు ఏకైక మార్గం యేసు రక్తమే” అన్నది నేటి అధికశాతం సువార్తీకుల వాదన.
నేడు జరుగుతున్న ఈ ప్రచారానికి సంబంధించిన పై కథనం బైబిల్లో ఎక్కడైనా ఉందా? యేసు గానీ, శిష్యులు గానీ ఇలాంటి ప్రచారం చేశారా? పాత నిబంధనలో దేవుడు రక్తాన్ని ప్రేమించాడా? అసహ్యించుకున్నాడా? పాతనిబంధనలో దేవుడు బలులు కోరుకోవటంలో ఆంతర్యం ఏమిటి? పాతనిబంధనలో ప్రతీ పాపానికి రక్తమే పరిహారమైతే నరహత్య, వ్యభిచారం, దొంగతనము వంటి ఘోర పాపాలకు బలులు ఇచ్చినట్లు వాక్యం తెలుపుతుందా? క్రొత్తనిబంధనలో పాపులు చేసు కున్న ప్రతి పాపానికి పరిహారంగా యేసు పెట్టింది కేవలం రక్తం మాత్రమేనా? తీర్పు దినం నాడు “నిత్యజీవం” లేక “నిత్యమరణం” కేవలం తన రక్తాన్ని “విశ్వసించటం”, లేక “విశ్వసించకపోవటం” అన్న దాని ఆధారంగా ఇవ్వబడ నున్నాయని యేసు అంటున్నారా? వగైరా అనేక ప్రశ్నలకు సమాధా నంగా వాక్యానుసారంగా వ్రాయబడిందే “రక్షణకు ఏకైక మార్గం యేసు రక్తమా?” అన్న పుస్తకం. ఉచితంగా Down Load చేసుకుని చదువగలరు.