Posted by The Bible answer for the all misconceptions in Christianity | www.answerofbible.com on Friday, 12 May 2017
అమాయక భక్త జనం సంపదను సునాయాసంగా దోచుకోవటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్న కొందరు దుర్మార్గులు ఆధ్యాత్మిక రంగాన్ని అడ్డుపెట్టుకుని ఏ మాత్రం కష్టపడకుండా ప్రజలనుండి డబ్బు సంపాదించాలనే పన్నాగం ఆదినుండి పన్నుతూనే వచ్చారు.
అయితే ప్రజలు “ఏక దేవుని విధేయులు”గా ఉన్నంత వరకు అది సాధ్యపడదు. కాబట్టి వారు పన్నిన కుట్ర ఏమిటంటే ప్రజల దృష్టిలో బోధకుల మాదిరిగానే కబడుతూ, పైకి “ఏక దేవుని దృక్పథం” బోధిస్తున్నట్టు నటిస్తూనే, “బహు దైవాల విధేయతా దృక్పథం” వైపు మరల్చటమే! ఆ కుట్రలో భాగంగా ప్రజలను “ఏక దేవుని ఆరాధన” నుండి తప్పించటానికి “ఆ దేవుడే శరీరధారి అయి అవతరి స్తుంటాడ”ని, “దేవుడు బహుళత్వం” కలిగి ఉన్నాడని గ్రంథ వ్యతిరేక విశ్వాసాలను కల్పించి వాటిని మూల విశ్వాసాల స్థానంలో ప్రచారం చేస్తున్నారు.
ఈ విధంగా ప్రజలను “ఏక దేవుని విధేయతా దృక్పథం” నుండి తప్పించి, “బహుదైవాల విధేయతా దృక్పథం” వైపునకు మరల్చటమే లక్ష్యంగా పెట్టుకున్న బోధకులే అబద్ధ ప్రవక్తలు. అందుకే యేసు- “అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొఱ్ఱెల చర్మం వేసుకుని మీ యొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు” అని ముందే హెచ్చరించి ఉన్నారు. అయితే ఏ లక్షణాల ఆధారంగా అబద్ధ ప్రవక్తలను కనిపెట్టవచ్చు? వారు బోధించే విశ్వాసాలు ఏమిటి? నిజ క్రైస్తవునిగా మారటానికి మనం ఎన్నుకోవలసిన బోధకుడు ఎలా ఉండాలి? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వాక్యానుసారంగా వ్రాయబడిందే “అబద్ధ ప్రవక్తలు...?” అన్న పుస్తకం. ఉచితంగా Down Load చేసుకుని చదువగలరు.