• Contact us
  • Privacy Policy
  • About Us

The Bible answer for the all misconceptions in Christianity | www.answerofbible.com

  • Home
  • English Articles
  • తెలుగు అంశములు
  • Books
  • Videos
  • Editorial
  • More
    • General Topics (English)
    • General Topics (Telugu)
    • Folders (English)
    • Folders (Telugu)
    • Bible-Quran topics

Recent Acticles

Home » Uncategories » The analysis that the Christians should do about Muhammad (s) | క్రైస్తవులు ప్రవక్త ముహమ్మద్(స) విషయంలో చెయ్యాల్సిన విశ్లేషణ!

The analysis that the Christians should do about Muhammad (s) | క్రైస్తవులు ప్రవక్త ముహమ్మద్(స) విషయంలో చెయ్యాల్సిన విశ్లేషణ!

Posted by The Bible answer for the all misconceptions in Christianity | www.answerofbible.com on Wednesday, 14 November 2018

analysis-Christians-should-do-about-Muhammad
The analysis that the Christians should do about Muhammad


క్రైస్తవులు ప్రవక్త ముహమ్మద్(స) విషయంలో చెయ్యాల్సిన అసలు విశ్లేషణ
 



ప్రవక్త ముహమ్మద్ (స) దైవప్రవక్తా? కాదా? అన్న పాయింటుపై ఎక్కువగా కుతూహలం కలిగి ఆ అంశంపై ఎక్కువగా చర్చ చేసేది క్రైస్తవసోదరులే అనటం అతిశయోక్తి కాదు! కారణం ఆయన గురించి వారి బైబిల్లోనే వ్రాసి ఉంది కనుక. అది బహిర్గతం అయితే ఎక్కడ సామాన్య క్రైస్తవులు ఆయన పట్ల సామాన్య క్రైస్తవులు ఎక్కడ ఆకర్షితులౌతారో అన్న భయంతో కాబోలు ఎక్కువగా ఆయన వ్యక్తిత్వంపై బురదజల్లే ప్రయత్నం చెయ్యటం జరుగుతుంది.  ఈ భయం తాలూకు ఎఫెక్టు ఆయన విషయంలో వారు చేసే అనాలసిస్ ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ అసలు ఆలోచించాల్సిన పాయింటు ఏమిటంటే- “ప్రవక్త ముహమ్మద్(స) దైవ ప్రవక్తా? కాదా? అన్నది ఆయన ఉన్న కాలంనే తేలిపోయిందా? లేక ప్రస్తుత కాలంలో తేల్చాల్సింది ఏమైనా మిగిలిపోయి ఉందా?” అన్నది.

ఈ టాపిక్ పై ప్రత్యేకంగా నేను దృష్టి పెట్టటానికి ప్రధాన కారణం- చరిత్ర యొక్క ఏమాత్రం అవగాహన లేని నేటి అభినవ విమర్శకులు కొందరు తామేదో జ్ఞానంలో పెద్ద తోపులమనుకుని, తమకున్న మోడ్రన్ బ్రైన్ తో ఇన్నాళ్లూ ఎవరికీ రాని ఆలోచనలు తమకే వచ్చినట్లు ఇస్లాం పై ఏవేవో గుడ్డి విమర్శలు చెయ్యటమే కాక, తెలిసీ తెలియని జ్ఞానంతో చరిత్రను స్వంత అనాలసిస్ చేసేసి, ముహమ్మద్ సత్య ప్రవక్త కాదు అని తీర్మానించేయటమే!

ముహమ్మద్(స) విషయంలో నేటి అభినవ విమర్శకులు లేవనెత్తే విమర్శలు ముఖ్యంగా-

“పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ముహమ్మద్ అనే వ్యక్తి తన నలభయ్యో దశకంలో తానే దైవ ప్రవక్తను అని ప్రకటించుకుని, యూదుల గ్రంధాలలో నుండి కొన్ని చరిత్రలను కాపీ చేసుకుని ఖురాన్ అనే గ్రంధాన్ని రచించి, తన చివరి ఇరవై దశకాలలో ఇస్లాం అనే ఓ క్రొత్త మతాన్ని కరవాలల బలంతో తన స్థాపించాడు. ఆ విధంగా తాను ప్రవక్తను అని అందరినీ నమ్మించి ఇస్లాంను అంగీకరించని అవిశ్వాసులను చంపి అయినా సరే తన ధర్మాన్ని స్థాపించమనే ఆజ్ఞ ఇచ్చాడు. దీనికారణం గానే జిహాద్ పేరుతో ఉగ్రవాదం వ్యాపించింది” అన్నవి.


నిజంగానే ఒక వ్యక్తి గురించో, లేక ఒక సబ్జెక్టు గురించో నిజానిజాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉండి ఆధారాలు సేకరించటం మొదలు పెట్టినప్పుడు తాను సేకరిస్తున్న ఆధారాలు సైతం ప్రామాణికమైనవా? కావా? నేను తీసుకున్నది రైట్ సోర్స్ నుండా? కాదా? అన్నది కూడా కచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదండీ మావాడు చెప్పిందే కరెక్టు! నాకు అనిపిస్తుందే రైటు! చెక్ చేసుకోవాల్సిన పనిలేదు అని ఊహించుకుని గుడ్డిగా విమర్శిస్తే చేసేదేమీ లేదు! కానీ ప్రస్తుత సోషల్ మీడియాలో ఇస్లాంకు, ప్రవక్త ముహమ్మద్ వారికి వ్యతిరేకంగా చెయ్యబడుతున్న పై విధమైన విమర్శలు, లేదా పై విధమైన విమర్శలతో కూడిన ఇస్లాం వ్యతిరేక సాహిత్యం నూటికి నూరు శాతం ఎవరో అనవగాహనతో చేసిన విమర్శల తాలూకు వినికిడి సమాచారం లేక ఇంటర్నెట్టులో ప్రవక్త ముహమ్మద్ (స) పట్ల అక్కసుతో చేసిన గుడ్డి విమర్శల తాలూకు చెత్త తప్ప ఆయనకు సంబంధించిన ప్రామాణిక చరిత్ర గ్రంధాల నుండి, ప్రామాణిక హదీసుల నుండి సేకరించబడిన ఆధారాలైతే కచ్చితంగా కావు. అయితే ఇలాంటి ఇస్లాం పట్ల లేదా ప్రవక్త ముహమ్మద్ (స) వారి పట్ల విమర్శలు లేక రచనలు చేసేవారు చెయ్యాల్సిన అసలు అనాలసిస్ ఏ కోణంలో ఉండాలి? అన్న అంశానికి సంబంధీనదే ఈ ప్రత్యేక వ్యాసం.


ప్రవక్త ముహమ్మద్ (స) కు వ్యతిరేకంగా పై విధమైన విమర్శలు లేనేత్తేవారు ఆయన విషయంలో ప్రస్తుతం చెయ్యాల్సిన అసలు అనాలసిస్ -


నిజంగా “ముహమ్మద్ అనే వ్యక్తి యూదుల గ్రంధాలలో నుండి కొన్ని చరిత్రలను కాపీ కొట్టేసి, ఖురాన్ అనే గ్రంధాన్నితానే రచించి, తాను దైవ ప్రవక్తను అని అందరినీ నమ్మించేశాడు! అన్న ఈ విమర్శే వాస్తవం అనుకుంటే...


1). ముహమ్మద్ (స) సమకాలీకులైన ప్రజలందరూ ఏది చెబితే అది నమ్మేసి, అడ్డంగా తలూపేసే గొర్రెలై ఉండాలి!


2). ఆనాటి ప్రజలందరిలో ఏ ఒక్కడూ కనీస అక్షరజ్ఞానం లేకుండా ముహమ్మద్ (స) చెప్పిందే వేదమని నమ్మేసే ఆటవిక మనుషులై ఉండాలి.


3). ముహమ్మద్ (స) లాజిక్కులతో సంబంధం లేకుండా ఏవో కొన్ని మ్యాజిక్కులు చేసి చూపించేసి, తానో దైవాంశ సంభూతుడనని కల్లిబొల్లి మాటలు చెప్పి, ప్రజలందరి మధ్య స్వామీజీ టైపు కలరింగు ఇచ్చేసి, జనాలందరినీ తన పట్ల ఆకర్షించుకోవాలి! అప్పటికే ప్రజలలో ఉన్న మూఢ విశ్వాసాలకు కాస్త అటు ఇటులో బోధించి, వారి అభిప్రాయాలకు తలొగ్గి, తన లాభం వరకు మాత్రమే చూసుకోవాలి!


4). తనను వ్యతిరేకించివారందరినీ నిర్దాక్షనీయంగా చంపేసి ఉండాలి!


ఇలాంటి పరిస్థితుల్లోనే ముహమ్మద్ (స) ఇస్లాంను వ్యాప్తి చేశారా?


పై వాటికి పూర్తి వ్యతిరేకమైన పరిస్థితులలో ఇస్లాం వ్యాప్తి జరిగిందన్నది ఇస్లాం విమర్శకుల్లో కనీసం ఒక్కరికీ తెలియదంటే అతిశయోశక్తి కాదు!

ఆయన సమకాలీకులైన ప్రజలందరూ నేను దేవుని ప్రవక్తగా నియమించబడ్డానని చెప్పగానే అడ్డంగా గొర్రెల్లా తలూపేసి ఆయన్ని గుడ్డిగా నమ్మేయలేదు! ఆయన స్నేహితులు, భార్య మరి కొందరు దగ్గరవారు తప్ప మొత్తం మక్కా పట్టణ వాసులు ఆయన పై తిరగబడ్డవారే! చివరకు రక్తమోచ్చేలా రాళ్ళతో కొట్టి, ఇస్లాం స్వీకరించిన ఆయన అనుచరులను క్రూరంగా హింసించి చంపి చివరకు ఆయన తాను ఉన్న మక్కా పట్టణం వదిలి పెట్టి మదీనా వలస వెళ్లిపోయేంతగా తీవ్ర హింసలకు గురి చేసేశారు.

నువ్వు ప్రవక్తవే అయితే అద్భుతాలు చేసి చూపించమని అడిగినప్పటికీ అలాంటివేవీ ఆయన చూపలేదు! ఆయన చూపిన ఏకైక అద్భుతం స్వయంగా తాను నిరక్ష్యరాస్యుడై ఉండి “ఖురాను వంటి మహత్తర గ్రంధాన్ని బోధించటం” మాత్రమే!


ఇక వారిలో అధికులు కనీస అక్షరజ్ఞానం లేని ఆటవిక మనుషులా అంటే అదీ కాదు! అప్పటికే అరబ్బీ సాహిత్యంలో ఆరితేరిన కవులు ఉన్నారు! పైగా నాటి అరబ్బులకు తమ అరబ్బీ సాహిత్యం పట్ల అమితమైన గర్వం ఉండేది. అరబ్బీ భాషలో మాకంటే బాగా ఎవరూ కవిత్వం రాయలేరని కళ్ళు నెత్తికెక్కి ఉండేవి! అటువంటి సందర్భంలో ముహమ్మద్ (స) బోధిస్తున్న ఖురాన్ దైవ వాణి అన్న విషయం చెప్పినప్పుడు వారు అది ఆయన స్వంత రచన అన్నారు ఇప్పటి క్రైస్తవుల్లాగ! అయితే అప్పటికే తమ అరబ్బీ సాహిత్యంపై ఎంతో పట్టు ఉన్న ఆనాటి అరబ్బులకు ఖురాన్ విసిరిన ఒక ఛాలెంజ్ మొత్తం అరేబియాలో ఉన్న అప్పటి అరబ్బు సాహిత్యకారుల కాళ్ళ క్రింద భూకంపాన్ని తెచ్చింది.



ముహమ్మద్ (స) దైవ ప్రవక్తా? కాదా? అన్నది తేల్చటానికి స్వయంగా ఖురానే గీటురాయి!


ఒక రకంగా చెప్పాలంటే ఈనాటి యూదులు, క్రైస్తవులు లేవనెత్తే విమర్శలు, అనుమానాలకంటే వందరెట్ల విమర్శలు, అనుమానాలు ముహమ్మద్ (స) పట్ల నాటి మక్కా వ్యతిరేకులు, యూదులు లేవనెత్తే వారు. ఏకాస్త చిన్న రంధ్రం దొరికినా చాలు ఆయనను అబద్ధ ప్రవక్త అని నిరూపించటానికి వేయికళ్లతో నిరంతరం ఆతృతతో ఎదురు చూస్తున్న సమయం అది. ఆ సందర్భంలో వారి కళ్ళు ఆయన బోధిస్తున్న ఖురాన్ పై పడింది. అది కేవలం కల్పితం, ఎవరి వద్దో నేర్చుకుని వచ్చి ఖురాన్ అనే పేరుతో బోధిస్తున్నాడన్న విమర్శ లేవనెత్తటం మొదలెట్టారు. ఆ సందర్భంలో ఖురాన్ చేసిన ఛాలెంజ్ – ఒకవేళ ఖురాన్ మానవ రచనే అయితే అందులో రెండు మూడు వాక్యాలతో కూడిన ఒక చిన్న అధ్యాయం వంటి అధ్యాయాన్ని రచించి తీసుకు రమ్మంది.


అరబ్బీ వచ్చిన వారెవరైనా ఖురాన్ కు సరితూగే సాహిత్యం రంచించెయ్యవచ్చుగా?


ఖురాన్ ముహమ్మద్ (స) కల్పించి రచించిన గ్రంధమని విమర్శించిన ఆనాటి అరబ్బు పండితులు, ఆనాటి అరబీ భాష వచ్చిన యూదులైనా మరి ఖురాన్ విసిరిన ఈ ఛాలెంజ్ ను స్వీకరించవచ్చుగా! ఇప్పటికీ ఈ ఛాలెంజ్ ఖురాన్ లో వ్రాయబడి రెడీగా ఉంది. అదేదో ఖురాన్లోని ఓ రెండు మూడు లైన్లతో కూడిన ఓ అధ్యాయం వంటి రచన రాసి పడేసి “ఇదిగోనయ్యా ముహమ్మద్ నీ ఖురాన్ ను పోలిన అధ్యాయం” అని చెప్పేసి, ఆనాడే ప్రజల మధ్య ఆయన ఒక అబద్ధ ప్రవక్త, ఆయన బోధిస్తున్న ఖురాన్ కేవలం కాపీ మాత్రమే నిరూపించేయ్యటం ఎంతో సులభం కదా! పైగా ఆయన వారి సంక్షంలో ఉన్నారు. ఎక్కడో కూర్చుని చెప్పటంలేదు! మరి ఆనాడు అలాంటి ప్రయత్నం జరగలేదనుకుంటున్నారా? ఖురాన్ విసిరిన ఈ ఛాలెంజ్ విన్నదే తడవుగా అందరూ ఖురాన్ లోని కొన్ని వాక్యాలను పోలిన రచన చేయటంలో తలమునకలయ్యారు. ముహమ్మద్ ను ఓ అబద్ధ ప్రవక్త అని నిరూపించటానికి రాత్రింబవళ్ళు ఎన్ని తంటాలు పడినా ఖురాన్ సాహిత్యం, ఆ పదాల అమరిక మరియు పొందిక, దాని లోతైన భావం, భావగర్భతతో సరితూగ గలిగే ఒక్క వాక్యమైనా రచించలేకపోయారు. చివరకు ఖురాన్ మానవ విరచిత గ్రంధం కాదు, అది విశ్వపాలకుని తరఫున అవతరించబడిన్న విషయం ముహమ్మద్ (స) ఉన్న కాలంలోనే తేలిపోయింది.


కాబట్టి ఖురాన్ గ్రంధం ముహమ్మద్ స్వంత రచన అని గొంతుచించుకునే వారు 1400 వందల సంవత్సరాల నుండి ఇలా విమర్శిస్తూ కాలం వెళ్ళబుచ్చెకంటే అదేదో అరబ్బీ బాగా తెలిసిన ఓ క్రైస్తవుణ్ణో, యూదుణ్ణో పట్టుకుని లేదా అరబ్బీ బాగా వచ్చిన వాడేవాడినైనా పట్టుకుని ఖురాన్ లోని వాక్యాలతో పోలిన ఓ నాలుగైదు లైన్లు వ్రాసి చూపించేస్తే సరిపోతుందిగా! ఖురాన్, ముహమ్మద్ స్వంత రచన అని ఎంత గొంతుచించుకున్నా ఏంటి లాభం?


కాబట్టి ఖురాన్, ముహమ్మద్ యొక్క కల్పితము లేదా బైబిల్ నుండి కాపీ కొట్టి రాసేశాడు అన్న విమర్శలే నిజమైతే... Midle East దేశాల్లో అరబ్బీ భాష వచ్చిన దాదాపు 16 మిలియన్ల క్రైస్తవులు మరియు యూదులు ఖురాన్లో ని ఏదైనా అధ్యాయం వంటి ఒక చిన్న అధ్యాయమైనా ఎందుకు రచించి తీసుకు రాలేకపోయారు? ఖురాన్, బైబిల్ నుండి కాపీ కొట్టి రాసేశాడు అన్నప్పుడు అదేదో అరబ్బీ బైబిల్లోని కొన్ని వాక్యాలు తెచ్చేసి ఇదిగో ఖురాన్ కు సరితూగే వాక్యాలని చూపించేసినా సరిపోతుందిగా? ఈ పద్నాలుగు వందల ఏళ్లలో గతించిన ఏ అరబీ సాహితీవేత్తా ఖురాన్ విసిరిన ఛాలెంజ్ ఎందుకు స్వీకరించలేకపోయాడు? ఈ ఒక్క పాయింటే ముహమ్మద్ (స) ద్వారా ఇవ్వబడిన ఖురాన్ దైవ గ్రంథం అన్న విషయాన్ని నిరూపిస్తుంది. ఆయన స్వయం ప్రకటిత ప్రవక్త కాదు దైవ ప్రవక్త అన్న విషయాన్ని నిరూపిస్తుంది.


ముహమ్మద్ (స) నిజంగా ఖురాన్ ను స్వంతంగా రచించేసి, ఇస్లాం అనే ఓ క్రొత్త మతాన్ని కనిపెట్టి అప్పటి ప్రజలందనీ తాను కల్పించిన ధర్మంలో లాగేయ్యాలంటే సింపుల్ గా లాజిక్కులతో సంబంధం లేకుండా ఏవో కొన్ని మ్యాజిక్కులు చేసి చూపించేసి, ప్రజందరి మధ్యలో స్వామీజీ టైపు కలరింగు ఇచ్చేసి, జనాలందరినీ తన పట్ల ఆకర్షించుకోవచ్చు! అప్పటికే ప్రజలలో ఉన్న మూఢ విశ్వాసాలకు కాస్త అటులో బోధించి, వారి అభిప్రాయాలకు తలొగ్గితే ఎలాంటి మత విధానాన్నైనా స్థాపించేయ్యటం అప్పటికి చాలా సులువు. ఇప్పుడు ఉన్న స్వామీజీలందరూ జనాల మధ్య సక్సెస్ అవ్వటానికి ఫాలో అయ్యే ఫాల్ములా కూడా ఇదేగా!


కానీ పై విధానానికి పూర్తి భిన్నంగా ముహమ్మద్ (స) చెప్పిన విషయాలు –


1.“నేను కేవలం మానవుణ్ణి, మీ లాంటి వాణ్ణి, నాకు దైవ వాణి ద్వారా ఇలా తెలుపబడింది- మీ దైవం కేవలం ఒకే దైవం” (18:110).


2.“నేను కొత్త ప్రవక్తనేమీ కాను. రేపు మీకు ఏమి జరగనున్నదో, నాకు ఏమి జరగనున్నదో నాకు తెలియదు. నేను నా వద్దకు పంపబడిన దైవ వాణిని మాత్రమే అనుసరిస్తున్నాను. నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని తప్ప మరేమీ కాను” (46:9).


3.“నా వద్ద అల్లాహ్ నిధి నిక్షేపాలు ఉన్నాయని గానీ, నాకు అగోచర జ్ఞానం ఉంది అని గానీ, నేను మీతో చెప్పటం లేదు! నేను కేవలం నాపై అవతరించిన వహీని మాత్రమే అనుసరిస్తాను” (6:50).


నేటి క్రైస్తవులు చెబుతున్నట్టు ముహమ్మద్ తానే దైవ ప్రవక్తను అని ప్రకటించుకుని, ఇస్లాం అన్న పేరుతో ఓ అబద్ధపు ధర్మాన్ని వెలుగులో తెచ్చి, తాను స్వంతంగా ఖురాన్ అనే గ్రంధాన్ని రచించించేసి ప్రజలను తన పట్ల ఆకర్షితులను చేసుకున్నాడు అన్న విమర్శే నిజమైతే... ప్రజలకు తాను దైవ ప్రవక్త అని నమ్మించటానికి ఏవో కొన్ని మ్యాజిక్కులు చూపించి తాను దైవాంశ శంభూతుడనని తనకు అగోచర జ్ఞానం ఉందని, తనకు దైవ శక్తులు ఉన్నాయని కల్లిబొల్లి కబుర్లు చెప్పి, ప్రజలను తనవైపు కచ్చితంగా త్రిప్పుకుంటాడు. కానీ, ఆయన దైవం తరఫున నియమించబడిన ప్రవక్త కనుక, దేవుడు చెప్పమన్నది తప్ప స్వయంగా తనకు తానుగా ఏదీ అతిశయించి మాట్లాడే అనుమతి సైతం ఉండదు కనుక- “నేను కేవలం మానవుణ్ణి, మీ లాంటి వాణ్ణి, రేపు మీకు ఏమి జరగనున్నదో, నాకు ఏమి జరగనున్నదో నాకు తెలియదు. నేను నా వద్దకు పంపబడిన దైవ వాణిని మాత్రమే అనుసరిస్తున్నాను, నా వద్ద అల్లాహ్ నిధి నిక్షేపాలు ఉన్నాయని గానీ, నాకు అగోచర జ్ఞానం ఉంది అని గానీ, నేను మీతో చెప్పటం లేదు” అని ప్రకటించారు.


ముహమ్మద్ నిజంగా తాను స్వంతంగా ఓ మత విధానాన్ని స్థాపించి, తానే దైవ ప్రవక్తను అని ప్రకటించేసుకుని ఉంటే తన ధర్మం వైపు, తన వైపు ప్రజలను తనవైపు ఆకర్షించుకునే సంకల్పం ఉన్న వ్యక్తి పై విధంగా మాట్లాడతాడా?


ఓ ప్రవక్త అనే వాడు ఇలా మాట్లాడతాడా? అని అప్పటి ప్రజలు ఆయనను హేళన సైతం చేసేవారు. కానీ వారికి తెలియదుగా, మరికొద్ది సంవత్సరాలలో ఇస్లాం కేవలం అధ్బుతాలు, మహిమలు చూపించటం ద్వారా కాకుండా దాని సత్యత, జ్ఞానం ఆధారంగా మొత్తం అరేబియాను వశం చేసుకుంటుందని!

ఇదే విధంగా యేసు సైతం – “నా అంతట నేను ఏమి చేయలేను, మాట్లాడలేను. నేను తండ్రి నేర్పినట్టుగా మాట్లాడుచున్నాను, ప్రళయ ఘడియ ఎప్పుడు రానుందో నాకు తెలియదు” అనే చెప్పారు. ఇక యేసు ద్వారా జరిగిన మహిమలు సైతం అది యేసు స్వంత శక్తి ద్వారా కాక “దేవుడు, యేసు ద్వారా చేయించాడు” (అపోకా 2:22) అని బైబిల్ చెబుతుంది.

నేటి ముహమ్మమ్మద్ వ్యతిరేకులు చెబుతునట్టు ఆయన స్వయం ప్రకటిత ప్రవక్త తప్ప దైవ ప్రవక్త కాదు అన్నదే నిజమైతే ...అప్పటికే ప్రజలలో పెరుకుపోయి ఉన్న వడ్డీ తినటాన్ని గురించి, వ్యభిచారం, జూదం, మధ్యం వంటి చెడులపట్ల తన గళాన్ని విప్పరు! ఆయన ఇంకా చెబుతున్నదేమిటంటే-


1.ఒక్క సృష్టికర్త అయిన దేవుడు తప్ప సృష్టిలో ఏ ఒక్క సృష్టితమూ ఆరాధనకు యోగ్యమైనదీ కాదు, ఎవరికీ దైవత్వమూ లేదు. సృష్టిలో మానవులను, విగ్రహాలను, ఇతరమైన వేటినీ దైవాలుగా భావించి పూజించటం ఘోరమైన పాపం.


2.వడ్డీ తినటం నిషేధం, వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు, ఓ స్త్రీ పట్ల చెడు దృష్టితో సైతం చూడకూడదు.


3.కన్య మేరీ కుమారుడైన యేసు ఒక దైవ సందేసహరుడు మరియు మెస్సియ తప్ప మరేమీకాదు. ఆమె తల్లి పవిత్రురాలు.


ఏవో కల్లి బొల్లి కబుర్లు చెప్పి, నిజంగా ప్రజలను తనపట్ల ఆకర్షించుకోవాలనుకే ఓ అబద్ధీకుడు పై విధమైన బోధలు చేసి ప్రజలతో కావాలని శతృత్వం ఎందుకు కొని తెచ్చుకుంటాడు?

ఈ బోధలు చెయ్యటం మొదలు పెట్టగానే మొత్తం మక్కా లో ఉన్న విగ్రహారాధకులు, యూదులు, క్రైస్తవులు ముహమ్మద్ (స) పిచ్చివాడని, అబద్ధాలకోరని నిందలు మోపటం మొదలెట్టారు. ఆయన పై దూషణల సంధించారు. ఆయన శిష్యులను క్రూరంగా చంపటం మొదలెట్టారు. చివరకు ఆయనను సైతం హత్య చేయటానికి పన్నాగాలు పన్నారు. మా నమ్మకాలకు వ్యతిరేకంగా బోధించే అబద్ధ ప్రవక్త అని నిందించారు! అప్పటికే కాబాలో 365 విగ్రహాలు పూజాలందుకునేవి. 

సూర్యచాంద్రాదులను దైవాలని భావించి పూజించేవారు. ఆటవికతతో కూడిన నాటి మక్కా వాసులలో వ్యభిచారం అప్పటికి చాలా మామూలు విషయం. కొన్ని వందల యేళ్లుగా ఏ ప్రవక్తా ఉద్భవించని కారణంగా అజ్ఞానం, ఆటవికతనంలో ఎప్పుడో హద్దులు దాటిపోయారు. అటువంటి ప్రజల మధ్య ముహమ్మద్ (స) చేస్తూ వస్తున్న పై విధమైన బోధలు విషతుల్యమైపోయాయి. మక్కా వాసులలో, యూదులలో కొందరు దుర్మార్గులు ముహమ్మద్ ఒక అబద్ధ ప్రవక్త అని నిరూపించే పనిని మరికాస్త వేగవంతం చెయ్యటం మొదలెట్టారు.


ఆ నేపథ్యంలో ఖురాన్ విసిరిన రెండవ ఛాలెంజ్!


ఒకవేళ ఖురాన్ ముహమ్మద్ స్వంత రచన అయితే దానిలో ఏవో రెండు మూడు వాక్యాలతో కూడిన చిన్న అధ్యాయం రచించి తీసుకురమ్మన్నది మొదటి ఛాలెంజ్ అయితే, అప్పటి ముహమ్మద్ వ్యతిరేకులకు ఖురాన్ విసిరిన రెండవ ఛాలెంజ్ - “ముహమ్మద్ దైవ ప్రవక్తా? కాదా? అన్న విషయంలో ఏమాత్రం సందేహం ఉన్నా ఆయనకు సంబంధించిన ప్రస్తావన తౌరాత్, ఇంజీల్ గ్రంధాలలో వ్రాయబడి ఉంది! మీ గ్రంధాలు తీసుకు రండి” అన్నది.


ముహమ్మద్ దైవ ప్రవక్త కాదు స్వయం ప్రకటిత అబద్ధ ప్రవక్త అని ఏదోలా నిరూపించాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్న నాటి యూదులకు, మక్కా వాసులకే కాదు ఈనాటి యూద, క్రైస్తవ పండితులకు నిజంగా ఖురాన్ విసిరిన రెండు చాలెంజ్ లు ఓ రకంగా గోల్డెన్ ఆఫర్ అని చెప్పాలి!


కానీ, జరిగిందేమిటంటే- ఈ రెండు ఛాలెంజుల్లో ఆనాటి ముహమ్మద్ (స) వ్యతిరేకులు అడ్డంగా ఓడిపోయారు! వారు 1. ఖురాన్ లోని అతి చిన్న అధ్యాయంవంటి ఓ చిన్న అధ్యాయాన్ని కూడా రచించి తీసుకురాలేకపోయారు! ఈ విషయంలో ప్రవక్త ముహమ్మద్ (స) చేసిందేమిటంటే- “అల్-కౌసర్” అనే కేవలం 3 వాక్యాలు కలిగిన అతిచిన్న అధ్యాయంలో 2 వాక్యాలు వ్రాసి కాబా గోడకు తగిలించి, వాటికి సరితూగే మిగతా ఒక్క వాక్యాన్ని వ్రాసి పూర్తి చెయ్యమని ఛాలెంజ్ విసిరారు! అప్పటికే అరబ్బీ భాషపై తమకు ఉన్న పట్టు ఎవరికీ లేదని అహంకారానికి గురై ఉండే మక్కా వాసుల్లో కవులు రాత్రింబవళ్లూ తల పీక్కున్నా ఆ అధ్యాయాన్ని పూరిచెయ్యలేకపోయారు! చివరకు ప్రవక్త ముహమ్మద్ (స) 3 వ వాక్యం తానే వ్రాసి చూపాకగానీ చాలా మందికి తెలిసిరాలేదు! ఖురాన్ మహా జ్ఞానవంతుడైన సృష్టికర్త తరఫునుండి అవతరించబడిన మహా గ్రంథమని!


ముహమ్మద్ (స) రాక కోసం నిర్మించబడిందే మదీనా (సేల)!

అప్పటికే బైబిల్లో ప్రవక్త ముహమ్మద్ (స) రాకకోసం “సేల (మదీనా)” వాసులు సంతోషిస్తారని, కేదారు వాసులు (ఇష్మాయేలియులు) బిగ్గరగా పాడతారని లేఖనాల్లో వ్రాయబడి ఉంది (యెషయా 42:11)! సేల పర్వతం ఇప్పటికీ అరేబియాలోని మదీనా పట్టణానికి దగ్గరలో ఉంది. ఆ విధంగా సేల పర్వత ప్రాంతంలో అడవులు తొలగించబడి ప్రవక్త ముహమ్మద్ (స) ను స్వాగతించటానికి సేల (మదీనా) అనే పట్టణం ముస్తాబయ్యింది. ఈ చరిత్ర, లేఖనాలు ఇప్పటి పై పై జ్ఞానమున్న క్రైస్తవులకు ఏమాత్రం తెలియదు! కేవలం ఆనాటి మరియు ఈనాటి బైబిల్ మూల భాషలపై మరియు లేఖన జ్ఞానం ఉన్న కొందరు యూదులకు, క్రైస్తవులకు తప్ప!

ఇక ముహమ్మద్ (స) యుద్ధాలు చేసింది ఇస్లాం వ్యాప్తి కోసమా? దాని రక్షణ కోసమా?


ఇస్లాం కత్తితోనే వ్యాప్తిచెందిందని గుడ్డి విమర్శలు చేసేవారు గమనించాల్సింది:


1.ముహమ్మద్ (స) చేసిన మొదటి యుద్దం బద్ర్ అనే ప్రాంతంలో జరిగింది. దానిలో ముహమ్మద్ (స) తరఫున సైన్యం 300 మంది మాత్రమే! పైగా వారు కూటికి చిన్నచిన్న పనులు చేసుకునే బీదసాదలు, కొందరు యువకులు, వయసు పైబడిన వారు వారు మాత్రమే, వారు ఎప్పుడూ యుద్ధాలు చేసిందీ లేదు! చూసింది సైతం లేదు! శత్రు సైన్యం 1000 మంది. నిజంగా తానే దైవప్రవక్తను అని ప్రకటించేసే ఓ అబద్ధ ప్రవక్త అలాంటి అతికొద్ది బలహీనులైన కొందరిని తీసుకుని తనకంటే మూడు రేట్లు అధికంగా ఉన్న ఓ మహా సైన్యం పై దండెత్తతానికి సాహసిస్తాడా? కానీ, తనకు తన వెనుక ఉన్న సైన్యానికి కేవలం విజయం సత్యం వైపు ఉందనే భరోసా, ముహమ్మద్ సత్యసంధతత పై నమ్మకం వారిని నడిపించింది. అంతపెద్ద సైన్యాన్ని దేవుని సహాయంతో గెలవటం జరిగింది.


2.ఓ ప్రక్క భగ భగ మంటూ మండే ఎండలు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు, మరో ప్రక్క ఇసుక తుఫానులు, పైగా ఎడారి ప్రాంతం అటువంటి ఉష్ణోగ్రతల్లో కూడా 30 రోజులు రంజాన్ కఠిన ఉపవాస దీక్ష. తానే దైవ ప్రవక్తను అని ప్రకటించేసుకున్న ఓ అబద్ధీకుడే ముహమ్మద్ అయితే తాను ప్రజలకు సౌఖ్యాన్ని (Comfort) ని కలగజేస్తాడే గానీ, నీళ్లు సైతం సరిగ్గా దొరకని ప్రదేశాల్లో, బీదరికంలో కొట్టుమిట్టాడుతున్న తన అనుచరులకు నెలరోజుల ఉపవాసాల ఆరాధనను ఎందుకు నియమిస్తాడు? పైగా యుద్ధ సమయాలలో సైతం నమాజు (ప్రార్థన) ప్రక్కన పెట్టె అనుమతి లేదు. ఓ స్వయం ప్రకటిత ప్రవక్త బోధించే విషయాలు ఇలా ఉంటాయా?


3.కేవలం దైవ ధర్మాన్ని అణచాలన్న ఉద్దేశంతో, సత్య విశ్వాసులను చంపటానికి కాలు దువ్విన దుర్మార్గులకు వ్యతిరేకంగా మాత్రమే యుద్ధం చెయ్యమనే ఆజ్ఞ ఖురాన్లో ఉంది! తప్ప అన్యాయంగా ఒక్క అవిశ్వాసినైనా చంపటానికి ఖురాన్లో అనుమతి లేదు. ఈ విధంగా ఒక్క ఖురాన్ లోనే కాదు భగవద్గీత, బైబిల్లో గమనించినా ఇలాంటి ధర్మ యుద్ధాలు చెయ్యమనే ఆజ్ఞలు కోకొల్లలుగా చూడగలం.


ఈ విధంగా ముహమ్మద్ (స) దైవ ప్రవక్తా? కాదా? అన్నది ఆనాటి యూద, క్రైస్తవ పండితుల సమక్షంలోనే తేలిపోయింది. ఆయన ఉన్న సమయంలోనే అనేకమంది యూదులు, క్రైస్తవులు గుడ్డిగా కాకుండా పూర్వగ్రంధాల ఆధారంగా పరిశోధన చేసి ఆయనను దైవ ప్రవక్తగా అంగీకరించారు. ఆయనను ప్రవక్త కాదని తిరస్కరించి, ఆయనపై కత్తి దూసినవారే ఆయన ప్రధాన అనుచరులుగా మారిపోయారు. మక్కా విజయం అనంతరం లక్షల మంది అనుచరులు ఆయన చివరి ప్రసంగంలో పాల్గొన్నారు. వాస్తవం ఇదైతే ఆయన చరిత్ర పరిశీలించకుండా, ఖురానను నిస్పక్ష పాతంగా చదవకుండా ముహమ్మద్ దైవ ప్రవక్త కాదని జడ్జ్ మెంట్లు ఇచ్చే నేటి హిందూ, క్రైస్తవ మిత్రులు సంక్షిప్తంగా వివరించబడిన పై విషయాలు గమనించి, ప్రవక్త ముహమ్మద్ (స) విషయంలో వన్ సైడ్ అనాలసిస్ ను ప్రక్కనపెట్టి, నిస్పక్ష పాతంగా ఆయన చరిత్ర అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఆయన చరిత్రను ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అనాలసిస్ చేస్తున్న కారణంగానే యూరప్, బ్రిటన్ దేశాలలో ఇస్లాం అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఆయా దేశాలలో క్రైస్తవులే కాక, చర్చీలు సైతం ఇస్లాం స్వీకరిస్తున్నాయనటం అతిశయోక్తికాదు. అంటే చర్చీలు సైతం మసీదులు గా మారుతున్నాయి. ఈ విధంగా నిస్పక్ష పాతంగా ఆయన చరిత్రను అనాలసిస్ చేసిన మైఖేల్. హెచ్. హార్డ్ అనే ఓ స్పేస్ సైంటిస్ట్ తాను రచించిన 'The 100 -A Ranking of the Most Influential Persons in History' అనే గ్రంధంలో చరిత్రలో మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన 100 మంది మహాపురుషులలో ముహమ్మద్ కు మొదటి స్థానాన్ని ఇచ్చాడు.


Md Nooruddin


0 Response to "The analysis that the Christians should do about Muhammad (s) | క్రైస్తవులు ప్రవక్త ముహమ్మద్(స) విషయంలో చెయ్యాల్సిన విశ్లేషణ! "

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • “Yahweh” in Hebrew is... “Allah” in Aramaic & Arabic!
    The Hebrew term Jehovah which appears in Old Testament has been translated as Allah in Aramaic and Arabic New Testaments. To know this f...
  • What is real meaning of “I and Father are one?”
    I and my Father are one. – John 10:30 Believe me that I am in the Father and the Father in me… -John 14:11 According to the above ...
  • రోమా 9:5 ప్రకారం యేసు దేవుడా? | Is Jesus God according to Romans 9:5?
    Is Jesus God according to Romans 9:5? రోమా 9:5 ప్రకారం యేసు దేవుడా? “ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరమూ స్తోత్త్రార్హుడైయున్నాడ...
  • “గుర్తింపుపేరు”కు “గుణనామానికి” మధ్య భేదం ఏమిటి? | What is the difference between identity name? And attributive name?
    What is the difference between identity name And attributive name? “గుర్తింపుపేరు”కు “గుణనామానికి” మధ్య భేదం ఏమిటి? సాధారణంగా మని...
  • According to Isaiah 9:6… Is Jesus Mighty God?
    For unto us a Child is born, unto us a Son is given; And the government will be upon His shoulder. And His name will be called Wonderful, ...
  • జెకర్య 2:10 & మలాకీ 4:5,6 వాక్యాల ప్రకారం యెహోవాయే యేసుగా వచ్చారా?
    సీయోను నివాసులారా , నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును . – జెకర్య 2:10 యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగ...
  • IS MAN A BORN SINNER?
    IS MAN A BORN SINNER? In the name of Creator most merciful and beneficent What the theory of original sin which is being propagate...
  • IS JESUS GOD? WHY DID NOT PAUL PREACH SO?
    In the name of Creator most Merciful and Beneficent My dear Christian brethren! Though there are many of the Christian missionarie...
  • యేసు దేవుడే అయితే యేసు స్వతంత్రంగా కలిగి ఉన్న ప్రత్యేకత ఏదైనా ఉందా?
    నేటి అభినవ సువార్తీకుల వాదన ఏమిటంటే- యేసు తండ్రి లేకుండా పుట్టారు , అనేక అద్భుతాలు చేయగలిగారు , పాపులను క్షమించారు , ఇంకా ఆయనకు  సర్వాధ...
  • One who depends upon the Father (God) can be regarded to be equal with Him in any way?
    ONE WHO PROCLAIMS “I CAN DO NOTHING OF MYSELF” CAN BE  REGARDED  AS GOD HIMSELF? OR EQUAL WITH GOD? Then Jesus answered and said to...

Recent Posts

answer of bible

Recent Comments

Total Pageviews

Labels

Articles Books Books-1 Editorial General Topics (English) Is God Trinity? Or One? Is Jesus God? Or Messiah? Is The Blood necessary for Salvation? Jehovah is Allah OUR PURE AIM Slider Videos Was Jesus Died on Cross? Who is Another comforter? యేసు దేవుడా? మెస్సీయా?

Pages

  • Home
  • English Articles
  • Telugu Articles
  • Books Download
  • Editorial
  • Contact
  • About us
Copyright © The Bible answer for the all misconceptions in Christianity | www.answerofbible.com | Designed by Sakshyam Creative