Posted by The Bible answer for the all misconceptions in Christianity | www.answerofbible.com on Saturday, 10 June 2017
బైబిల్లో హెబ్రూ భాషలో యెహోవాగా పరిచయం కాబడిన సృష్టికర్త అయిన దేవుడే ఖురాను గ్రంధంలో అరబ్బీ భాషలో అల్లాహ్ గా పరిచయం అయ్యాడు. హైందవులు త్రాగే “పాలు” వేరు, క్రైస్తవులు త్రాగే “మిల్కు” వేరు అనటం ఎంత హాస్యాస్పదమో హెబ్రూలో “యెహోవా”గా పిలువబడిన దేవుడు వేరు, అరబ్బీలో “అల్లాహ్” గా పిలువబడిన దేవుడు వేరు అనటం కూడా అంతే హాస్యాస్పదం.
మరీ ముఖ్యంగా యెహోవా వేరు, అల్లాహ్ వేరు అన్న సిద్ధాంతం సైతం కేవలం ఈ మధ్యకాలం లో అంటే కేవలం ఇరవై శతాబ్దంలో కొందరిచే తయారు చెయ్యబడిందే తప్ప ఈ వాదన ఒకనాటి మహాజ్ఞానులైన క్రైస్తవ పండితుల మధ్య లేదు. దానికి గొప్ప ఉదాహరణ బైబిల్ ను అరబ్బీ భాషలో అనువదించిన ఆనాటి క్రైస్తవ పండితులు “యెహోవా” అని ఉన్న ప్రతీ చోటా “అల్లాహ్” అని అనువదించటమే!
అంతేకాక బైబిల్ క్రొత్త నిబంధనకు మూల భాష అయిన అరమైక్ భాషలో సైతం యెహోవా అని ఉన్న ప్రతీ చోటా అల్లాహ్ అనే ఉంటుంది. హెబ్రూ, అరమైక్, అరబ్బీ భాషలు వాస్తవానికి “సెమిటిక్” భాషలు. ఆ మూడు భాషల్లో సృష్టికర్త అయిన దేవుడు “ఎలోహ్” “అల్లాహ్” గా పరిచయం అయ్యాడు. అయినప్పటికీ యెహోవా వేరు అల్లాహ్ వేరు అని నిరూపించటాని కొందరు అనేక ప్రశ్నలు, విమర్శలు లేవనెత్తుతున్నారు. వాటన్నిటికీ వాక్యం వెలుగులో సమాధానం ఇవ్వటమే కాక, పరిశుద్ధ వాక్యం వెలుగులో “యెహోవాయే అల్లాహ్” అని నిరూపిస్తూ వ్రాయబడిండే ఈ పుస్తకం. ఉచితంగా Down Load చేసుకుని చదువగలరు.