Posted by The Bible answer for the all misconceptions in Christianity | www.answerofbible.com on Friday, 9 June 2017

సార్వత్రిక క్రైస్తవ సమాజానికి అత్యంత ప్రముఖ వ్యక్తి యేసు అయితే ఆ తరువాతి స్థానంలో ముఖ్యుడు ఎవరైనా ఉన్నారంటే అది పౌలు అని చెప్పవచ్చు.
ఇక పరిశుద్ధ బైబిల్ ప్రకారం దేవుడు ఎవరు? యేసు ఎవరు? అన్నది నిర్ధారించటానికి ఈ పుస్తకంలో కేవలం పౌలు వ్రాసిన పద్నాలుగు పత్రికలను మాత్రమే ఆధారంగా తీసుకోవటానికి కారణం పౌలు దేవుని గురించి, యేసును గురించి ఏ విశ్వాసాలైతే ప్రకటించాడో అవన్నీ యేసు పరలోకానికి చేర్చుకోబడిన తరువాత అక్కడ నుండి తనకు అధ్బుత రీతిలో దర్శనంలో కనపడి బోధించారని చెప్పుకోవటమే!
నేటి అధిక శాతం మంది బోధకుల వాదన ఏమిటంటే- “యేసు పరలోకంలో సర్వాధికారి అయిన దేవుడే! అయితే మానవ బలహీనతలతో కొద్దికాలం ఈ లోకంలో జీవితం గడిపి, పరలోకానికి చేర్చుకొనబడి, తిరిగి సర్వాధికారి అయిన దేవుడైపోయారన్నది! మరి కొందరు సువార్తీకులు చెప్పేది ఏమిటంటే- “వాస్తవానికి యేసు అటు పరలోకంలో దేవునిగా ఉంటూనే, ఇటు భూలోకంలో క్రీస్తుగా ఉన్నారు. కాబట్టి పరలోకంలో ఉన్న యేసే దేవుడన్నది!” ఈ వాదనలే నిజమైతే మరి పరలోకంలో నుండి యేసు బోధలు అందుకున్నానని ప్రకటించుకున్న పౌలు సైతం ఇలాంటి ప్రచారాలే చేస్తూ, యేసును దేవుడని పరిచయం చేసేవాడా? లేక యేసును క్రీస్తుగా పరిచయం చేస్తూ, ఆయనకు అతీతంగా ఉన్న యెహోవాను దేవునిగా పరిచయం చేసేవాడా? అన్న ప్రశ్నలకు పౌలు పద్నాలుగు పత్రికలనుండి సమాధానం ఇస్తూ వాక్యానుసారంగా వ్రాయబడిందే “పౌలు దృష్టిలో దేవుడు ఎవరు? యేసు ఎవరు?” అన్న పుస్తకం. ఉచితంగా Down Load చేసుకుని చదువగలరు.