Posted by The Bible answer for the all misconceptions in Christianity | www.answerofbible.com on Sunday, 11 June 2017
“దేవుడను నేనే మరి యే దేవుడును లేడు. నేనే దేవుడను నన్ను పోలిన వాడెవడును లేడు” “నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడూ ఉండడు” అంటూ భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో తాను ఒక్కడిని మాత్రమే దేవునిగా ఉంటానని ఒక ప్రక్క యెహోవా ప్రకటిస్తున్నప్పటికీ నేటి అధిక శాతం సువార్తీకుల వాదన ఏమిటంటే యెహోవాతో పాటు, యేసు, పరిశుద్ధాత్మలు సైతం సమాన దైవాలుగా ఉన్నారన్నది.
అత్యంత గమనార్హమైన విషయం ఏమిటంటే ఏ యేసు గురించి అయితే త్రిత్వంలో ఒక దేవుడని లేక యెహోవా అస్తిత్వంలో ఒక భాగమని కొందరు త్రిత్వ దైవత్వవాదులు ఊహించుకుంటున్నారో, స్వయంగా ఆ యేసే- “ఆయన (అంటే- యెహోవా) అద్వితీయుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడ”ని సాక్ష్యం ఇవ్వటాన్ని బట్టి యేసు ఏనాడూ తాను త్రిత్వంలో ఒక దేవుడనని భావించుకోలేదని తెలుస్తుంది.
ఇక త్రిత్వ సిద్ధాంతం యేసు అనంతరం క్రైస్తవంలో ఎవరు ప్రవేశపెట్టారు? యేసు, పౌలు, ఆదిమ అపోస్తలులకు అసలు త్రిత్వ సిద్ధాంతం తెలుసా? వారు ఎప్పుడైనా త్రిత్వం ప్రచారం చేసినట్టు బైబిల్లో ఉందా? త్రిత్వం పరిశుద్ధ లేఖన బోధే అయితే ప్రాచీన మార్గభ్రష్ట జాతులు తమ తమ దైవాలు త్రిత్వమై ఉన్నాయని ఎందుకు నమ్మేవారు? యేసు- తండ్రీ, నేను ఏకమై ఉన్నామని చెప్పింది తాను యెహోవా అస్తిత్వంలో భాగమనే అర్థంలోనా? ప్రస్తుతం పరలోకంలో యేసు మరియు పరిశుద్ధాత్మలు యెహోవా అస్తిత్వంతో ఏకమైపోయి త్రిత్వ దేవుళ్లుగా ఉన్నారా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వాక్యానుసారంగా వ్రాయబడిందే “త్రిత్వం బైబిల్ బోధా? అన్య బోధా?” అన్న పుస్తకం. ఉచితంగా Down Load చేసుకుని చదువగలరు.