Posted by The Bible answer for the all misconceptions in Christianity | www.answerofbible.com on Monday, 12 June 2017
సర్వసృష్టికర్త అయిన దేవుడు అనేకమంది ప్రవక్తలను యూదుల వద్దకు పంపటంలోని ఉద్దేశం- అప్పటికే దేవుని ఆజ్ఞలను విడిచి పెట్టి తమ ఇష్టానుసారంగా నడుచుకుంటున్న యూదులను సృష్టికర్త అయిన దేవుని వైపు తిప్పి, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించటం ఎలాగో చూపటం కొరకు అన్నది.
అయితే దైవ ధర్మాన్ని ఏమాత్రం ఇష్టపడని దుర్మార్గులైన యూదులు అనేక మంది ప్రవక్తలను రాళ్ళతో కొట్టి, సిలువ వేసి అతి క్రూరంగా చంపుతూ వచ్చారు. అదే క్రమంలో తమను సంస్కరించటానికి వచ్చిన యేసును సైతం కుట్రపూరితంగా సిలువ వేసి చంపటానికి అనేక ప్రయత్నాలు చేశారు. శాపగ్రస్త సిలువ మరణం నుండి తప్పించుకోవటానికి యేసు అనేక ప్రయత్నాలు చేశారు!
తనకు అయిష్టమైన సిలువ మరణం నుండి తప్పించమని యేసు ఎంతో వేదనతో ఆ దేవునిని కన్నీటి ప్రార్ధనతో వేడుకున్నారు. చివరకు యూదులు కుట్రపూరితంగా అనేక ఆరోపణలు మోపి రోమా ప్రభూత్వ హయాములో యేసుకు సిలువ దండన పడేలా చేశారు. ఆ విధంగా యేసుకు పడ్డ సిలువ దండన అన్నది యూదులు బలవంతంగా కుట్ర పన్ని వేసిన శిక్ష మాత్రమే! తప్పితే దేవుని పరిశుద్ధ ఆది సంకల్పానుసారంగా నెరవేర్చబడిన పరిశుద్ధ బలియాగం ఎంతమాత్రం కాదు. అయితే అనేక లేఖనాలలో దేవుడు, యేసుకు చేసిన వాగ్దానం ప్రకారం ఆయన యేసును సిలువ పై చనిపోకుండా కాపాడుకున్నాడా? లేదా? యేసు, సిలువ పై చనిపోయి ఉంటే సమాధిలో మూడు రోజులు చికిత్స ఎందుకు చేయించుకున్నారు? యేసును చంపాలని యూదులు కుట్ర పన్నటం వెనుక కారణమైన అంశం ఏమిటి? వగైరా అనేక ప్రశ్నలకు సమాధానంగా వ్రాయ బడిందే “సిలువ... బలియాగామా? కుట్రా?” అన్న పుస్తకం. ఉచితంగా Down Load చేసుకుని చదువగలరు.