Posted by The Bible answer for the all misconceptions in Christianity | www.answerofbible.com on Sunday, 11 June 2017
“యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును” అన్న వాక్యానికి అర్ధం- మనం ఎన్ని పాపాలు చేసుకుంటూపోయినా అవి మనకు అంటవు, యేసు మన పాపాలకు సిలువపై రక్తం చిందించి పెనాల్టీ చెల్లించేశారు. కనుక యేసు రక్తం మనం చేసుకుంటూపోయే పాపాలను కడిగి వేస్తుందని కాదు!
కానీ, నేడు జరుగుతున్న ప్రచారం ఏమిటంటే “యేసు సర్వ మానవాళి పాపాలనిమిత్తం తన రక్తం చిందించేశారు కనుక యేసును దేవునిగా నమ్ముకుంటూ, యేసు రక్తంలో కడగబడితే చాలు ఎంతటి ఘోర పాపి అయినా క్షమించబడి, పరిశుద్ధుడై పోతాడు. ఇక అతను చేసే పాపాలు అతనికి అంటవు” అన్నది. ఈ భావనే నేడు అధికశాతం క్రైస్తవులు నివసించే క్రైస్తవ దేశాలలో నివసించే ప్రజలలో పాపాల పట్ల నియంత్రణ కోల్పోయేలా చేసింది.
అందుకే నేడు వ్యభిచారం, హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, స్వలింగ సంపర్కం వంటి బైబిల్ నిషేధించిన ఘోర పాపాలు నమోదు కాబడుతున్న దేశాలలో అధికశాతం క్రైస్తవులు నివశిస్తున్న దేశాలే మొదటి పది స్ధానాలలో (Top ten లో) నమోదు కావటం అత్యంత బాధాకరం. కాబట్టి “యేసు సిలువ ఘట్టం కేవలం విశ్వసించి చేతులు దులుపుకునే విషయమా?” “యేసు ఏనాడైనా నేను మీ అందరి నిమిత్తం ప్రాణం పెట్టేసాను కాబట్టి మీ పాపాల పట్ల నిశ్చింతగా ఉండవచ్చని ప్రకటించారా?” “నా శరీరం తిని, నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గలవాడు అని యేసు ఏ అర్ధంలో చెప్పారు?” “యేసు రక్తం దేనికి సాదృశ్యం?” “ఒక విశ్వాసి కోరుకోవలసిన రక్తం ఏమిటి?” వగైరా అనేక ప్రశ్నలకు సమాధానంగా వాక్యానుసారంగా వ్రాయబడిందే “పాప పరిహారానికి రక్తం అవసరమా?” అన్న పుస్తకం. ఉచితంగా Down Load చేసుకుని చదువగలరు.