Posted by The Bible answer for the all misconceptions in Christianity | www.answerofbible.com on Monday, 28 August 2017
వేదోపనిషత్తులు, భగవద్గీత శాస్త్రాల వంటి గొప్ప మహత్తర ఆధ్యాత్మిక సంపద కలిగిన సనాతన వైదిక ధర్మమే- హైందవం! అయినప్పటికీ హిందూ శాస్త్రాలు బహుదైవారాధనను తీవ్రంగా ఖండిస్తున్నాయన్న వాస్తవం తెలుసుకోకపోవటం వలన, అవి ప్రకటిస్తున్న - "మనందరి దేవుడు ఒక్కడే! ఆయన తప్ప వేరొక దేవుడు! అన్న ఎంతో గొప్ప సత్యాన్ని పూర్తిగా గ్రహించకపోవటం వలన హైందవం అంటే బహుదైవారాధన మతంగా భావించబడుతుంది. ఈ నేపధ్యంలో మన వద్ద ఉన్న హిందూ శాస్త్రాలవెలుగులో ప్రతీ హిందూ సోదరుడూ తప్పక : సమాధానం తెలుసుకోవలసిన ప్రశ్నలు:
1). హిందూ శాస్త్రాల ప్రకారం దేవుడు ఒక్కడా? అనేకమా? మరియు ఆయన మౌలిక లక్షణాలు ఏమిటి?
2). సర్వేశ్వరుడైన దేవుడు అనేక కాలాలలో మహనీయుల రూపంలో అవతారిస్తూ ఉండేవాడా?
3). గీతలో శ్రీ కృష్ణుని రూపంలో అవతరించింది- సర్వేశ్వరుడా? పరమాత్ముడా?
4). గీతలో శ్రీకృష్ణుడు దేవుడా? సర్వేశ్వరునిని పరిచయంచేయటానికి వచ్చిన పరమాత్ముడా?
5). సర్వేశ్వరుడైన దేవుడు మానవదేహం ధరించి అవతరిస్తాడా?
6). రాముడూ, కృష్ణుడు వంటి మహనీయులు తమను తాము దైవాలని ఎక్కడైనా పరిచయం చేసుకున్నారా? లేక తమకు అతీతంగా ఉన్న సర్వేశ్వరుణ్ణే దైవంగా పరిచయం చేశారా?
పై ప్రశ్నలకు సమాధానంగా వ్రాయబడిందే ఈ చిరు పుస్తకం.